బియ్యపు మధుసూదన్ రెడ్డి అనే పేరు వినగానే, శాసనసభలో ఆయన చేసే కామెడీ గుర్తుకొస్తుంది. శ్రీ కాళహస్తి నియోజక వర్గం నుండి వైసీపీ పార్టీ తరపున ఎన్నికలలో గెలిచిన దగ్గరనుండి ప్రజలకి చేరువగా ఉంటూ ఎంతో మంది ప్రశంసలు పొందుతూనే ఉన్నారు. ఇంగ్లీష్ బాషా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేస్తూ ఆయన అమెరికాలో పడిన పాట్లు చెప్తూ , అసీంబ్లీ లో ఆయన చేసిన కామెడీ సోషల్ మీడియాలో ఇప్పటికి హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా అలానే, ఆయన పుట్టిన రోజు సందర్భంగా కూడా కొన్ని చోట్ల విచిత్రమైన రీతిలో బ్యానర్లు కట్టించారు. ఈనెల 15వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా మీరు అభిమానంతో తీసుకొచ్చినవి ఏవి వృధాగా కాకూడదనే ఉద్దేశంతో ఓ చిన్న మనవి. శాలువాలు, స్వీట్ ప్యాకెట్లు , పూల దండలు వద్దు. వాటికీ బదులుగా పెన్నులు , పుస్తకాలూ, స్కూల్ బ్యాగులు , పెన్సిల్స్ లాంటివి తీసుకురండి. పేద పిల్లల చదువులకి ఉపయోగపడతాయి అంటూ బ్యానర్లు వేయించడం చూసే వాళ్ళకి క్రొత్తగా ఉండటంతో ఆశ్చర్య పోతున్నారు.