కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల గ్రామం లో నిన్న జరిగిన జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కర్నూల్ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, జనసేన పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యక్తిగత దూషణలకు వెళితే ఇక సహించ బోయేది లేదు. జగన్ రెడ్డి కి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు కనబడడం లేదా...కరెంటు బైక్ ఇండికేటర్ కొట్టుకున్నట్టు పోతుంది.యువతకు ఉపాధి కల్పించలేకపోయారు.సిద్ధాంతాల పైన మాట్లాడండి.అదుపుతప్పి వ్యక్తిగత దూషణలకు వెళితే ఇక సహించ బోయేది లేదు అని హెచ్చరించారు.