అసాని ప్రభావంతో కందుకూరు నియోజవర్గంలో నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని మండల కేంద్రాలలో తుఫాన్ సయహక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మత్స్యకార గ్రామాల్లోని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.