లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామం లో పోలేరమ్మ గుడి సమీపంలో వర్షపు నీరు రోడ్డుపైన నిలిచిపోవడంతో గ్రామస్తులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు ఎటు వెళ్లడానికి విల్ లేకపోవడంతో రోడ్డు మీదే నిలిచిపోయాయి వర్షం వచ్చిన ప్రతిసారి నీళ్లు రోడ్డుమీద ఉంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. నీళ్లు రోడ్డుమీద ఉండడంతో వాహనాలు వచ్చిన సమయంలో వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుమీద వర్షపునీరు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.