అసని తుపాను నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లాలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల రాత్రి వర్షం కురిసింది. ఉదయం నుంచి శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, లావేరు, గార, వజ్రపుకొత్తూరు మండలాల్లో తేలికపాటి వాన పడింది. తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తాకిడి జోరుగా ఉన్నాయి. తుపాను దృష్ట్యా కలెక్టరేట్ తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్... జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం ఉంచారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.