`అసని` తుపాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా హై అలర్ట్‌గా ఉండాలని, తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాలకు పంపించామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమే అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయక పునరావాస శిబిరాలను తెరవాలన్నారు. సహాయక శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సూచించారు. అదే విధంగా సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనరేటర్లు, జేసీబీలు.. అన్నీసిద్ధం చేయాలని, కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa