రహదారులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. నూతన రహదారుల నిర్మాణం, రోడ్ల మరమ్మతులపై అధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa