ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 05:10 PM

ఏపీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సంచలన నిర్ణయంను  ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన 'గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం' కార్యక్రమంలో అధికార పార్టీ వైసీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. పలు చోట్ల ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ముఖం మీదే విమర్శలు చేస్తున్నారు. రోడ్లు వేయడం లేదని, ఇళ్లు కట్టించడం లేదని ఇలా పలు కారణాలతో ప్రజాప్రతినిధులపై వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గుడివాడలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్క పేద వాడు ఇల్లు లేదని అంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాగ్రహం పెల్లుబికుతుందనే వార్తలపై కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో జగన్ సీఎంగా ఉండడం వల్లే కోవిడ్ కష్టకాలంలో పేదలు చల్లగా ఉన్నారని చెప్పారు. వైఎస్ జగన్ జీవించి ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. వైసీపీ సర్కారు చేపట్టే సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే పనీపాటా లేకపోవడం వల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు వచ్చే ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు రావడం ఖాయమని, మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాటం చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa