ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్న జడేజా

sports |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 05:30 PM

ఐపీఎల్-2022 సీజన్‌లో చెన్నై జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు గాయం కావడంతో రవీంద్ర జడేజా ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. చివరికి ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, ఛాతీ భాగంలో జడేజాకు గాయమైందని తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌లో చెన్నై తదుపరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడని ఓ ప్రముఖ వెబ్ సైట్ వెల్లడించింది. దీంతో చెన్నై ఆడే తదుపరి లీగ్ మ్యాచ్‌లు ముంబై, గుజరాత్‌, రాజస్థాన్‌లతో జడేజా ఆడడని తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభంలో చెన్నైకు కెప్టెన్‌గా జడేజా వ్యవహరించాడు. అయితే వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో సారథ్య బాధ్యతలు స్వీకరించిన ధోని జట్టుకు వరుసగా రెండు విజయాలను అందించాడు.

ఇదిలా ఉండగా జడేజా ఈ సీజన్‌ మొత్తానికి దూరం కావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సీఎస్కే యాజమాన్యంతో జడ్డూకు విభేదాలు ఏర్పడ్డాయని, దీంతో గాయం కారణంగా చూపి అతడిని పక్కకు తప్పించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా చెన్నై తరుపున ఆడుతున్న జడేజా దూరం అవుతాడని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లే సీఎస్‌కే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో జడేజాను అన్‌ఫాలో చేసింది. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇలాంటి అనుభవమే డేవిడ్ వార్నర్‌కు ఎదురైంది. సన్‌రైజర్స్ జట్టుకు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌ను జట్టుకు దూరమయ్యాడు. తొలుత కెప్టెన్‌గా, ఆ తర్వాత ఆటగాడిగా పక్కన పెట్టేశారు. డ్రింక్స్ మోస్తూ కనిపించిన వార్నర్‌ను చూసి అభిమానులు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత సీజన్‌కు ఢిల్లీ జట్టులో వార్నర్ చేరిపోయాడు. అయితే ఇదే తరహాలో జడేజాకు జరుగుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa