ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన బంగారు రథం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 08:40 PM

శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత జరిగింది. సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రం రేవుకు బంగారు పూత పూసిన రథం కొట్టుకొచ్చింది. మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ రథం పై విదేశీ భాషలో 16-1-2022 అని రాసి ఉంది. రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందనే దాని పై ఆరా తీస్తున్నారు. మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందిన రథంగా అనుమానిస్తున్నారు. ఈ రథాన్ని చూసి స్థానికులు అనుభూతికి లోనయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa