వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మంత్రి పదవులు శాశ్వితం కాదు, రెండేళ్ల తర్వాత మార్పులు, చేర్పులు ఉంటాయి అని సీఎం జగన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే మంత్రి వర్గాలు మారుస్తూ క్రొత్త వర్గాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ నేపథ్యంలో శాఖ పరమైన ఆఫీస్ లకి చేరుకొని వస్తావా పరిస్థితులని తెలుసుకున్నారు. ఐతే, సీఎం జగన్ తో ప్రతి శాఖకి సంబంధించి మాట్లాడవలసిన అవసరం ఉండటంతో, ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్ తొలిసారి ఇవాళ సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. క్రొత్త మంత్రులకి సీఎం జగన్ దిశ నిర్దేశం చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa