నిబంధనలను పాటించని కాంట్రాక్టర్లపై రైల్వే శాఖ భారీగా జరిమానాలు విధిస్తూ వస్తోంది. తాజాగా బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లపై ఏకంగా లక్షరూపాయల జరిమానా విధించింది. రైళ్లలో ప్రయాణికులకు అంతంత మాత్రమే సేవలు అందుతున్నాయి. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్యాసింజర్ సర్వీస్ కమిటీ సభ్యులు జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు.
ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కి వెళ్లి ప్రయాణికులతో ముచ్చటించారు. ఇందులో భోజన వసతితో పాటు టీ, స్నాక్స్ ఇస్తుంటారు. వీటికి చార్జీలు కూడా టికెట్‌తో పాటే వేస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వడం లేదని కమిటీ సభ్యులు తెలుసుకుని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు లక్ష రూపాయల జరిమానాను విధించారు.