భారత ఎన్నికల ప్రధాన అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. రాజీవ్ కుమార్ గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు. 1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ కు చెందిన రాజీవ్ గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగానూ పనిచేశారు.