న్యాయం చేయాల్సిన పోలీసే మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి నవ్ గర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆ మహిళపై కన్నేశాడు. ఆ మహిళను తన మాటలతో గౌరవం పెరిగేలా చేశాడు. ఆమెతో సన్నిహతంగా ఉండటం చేశాడు.
ఆ మహిళ బాధలు తీరుస్తానని నమ్మించి ఆమెపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై మహిళ నవ్ గర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలియజేసింది. మహిళ ఫిర్యాదు మేరకు అధికారులు ఆ కానిస్టేబుల్ ని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 కింద ఆ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.