ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికూతురు మృతి కేసులో ట్విస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 04:26 PM

విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కూతురు సృజన మృతి ఇప్పుడు కొత్తకోణంలోకి మారింది. పెళ్లి కూతురు అధికంగా మెడిసిన్ వేసుకోవడం వల్లే మరణించిందని సీఐ వెల్లడించారు. బుధవారం ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లారని సీఐ రవికుమార్ తెలిపారు. ఆ తర్వాత పెళ్లి మండపంలో వధువు కుప్పకూలి మరణించింది. గుండెపోటులో మరణించిందని అంతా భావించారు. కానీ అధికంగా మెడిసిన్ వేసుకోవడంతో ఓవర్ డోస్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ప్రస్తుతం సృజన మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది. దీని పై మరిన్ని వివరాలు త్వరలోనే చెప్తామని సీఐ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com