రాష్ట్ర మైనింగ్ కార్యదర్శి పూజా సింఘాల్‌పై జార్ఖండ్ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. మన్రేగా నిధులతో పాటు ఇతర ఫండ్స్ విషయంలో మనీల్యాండింగ్‌కు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. సింఘాల్‌ను అయిదు రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకునే విధంగా రాంచీలోని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రోజున ఈడీ ఆమెను అరెస్టు చేసింది. మన్రేగా నిధుల మనీల్యాండరింగ్ కేసులు ఇది రెండవ అరెస్టు కాగా, ఇటీవల ఈ కేసులో సుమన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నివాసం నుంచి 17 కోట్ల నగదు రికవరీ చేశారు. అయితే సుమన్ కుమార్‌తో పూజా సింఘాల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ తేల్చింది.