ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 02:01 AM

తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై  కేంద్రంకు వినతించారు వైసీపీ ఎంపీ. వైసీపీ యువ నేత‌, తిరుప‌తి ఎంపీ గురుమూర్తి గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ స‌హాయ మంత్రి అన్న‌పూర్ణ దేవి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ సంజీవ్ కుమార్‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను వారి ముందు ఉంచారు. 


తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని వెంక‌ట‌గిరి కేంద్రీయ విద్యాల‌యంలో ఇంట‌ర్మీడియట్ కోర్సుల‌ను ప్రారంభించాలని విద్యా శాఖ స‌హాయ మంత్రిని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ విన‌తి ప‌త్రాన్ని కేంద్ర మంత్రికి అందించారు. అదే స‌మ‌యంలో తిరుప‌తి ప‌రిధిలోని రేణిగుంట ఎయిర్‌పోర్టు స‌మ‌స్య‌ల‌ను ప్రస్తావిస్తూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ చైర్మ‌న్ సంజీవ్ కుమార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com