ఒకప్పుడు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు గురించి అందరూ చెప్పుకునేవారు. ఇప్పుడు గంజాయి హాట్ టాపిక్ అయింది. అదొక బాగా మారిపోయింది. దరిమిలా నగరంలో జరిగే సగం నేరాలకు గంజాయి బ్యాచ్ ఉంటుందనే ప్రచారంలో ఉంది. కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ బ్యాచ్ వీరంగం సృష్టించింది. పోలీసులకుఫిర్యాదు చేస్తారా మీ అంతు చూస్తామంటూ స్థానికులను భయాందోళనకు గురి చేసి బైకులు తగలబెట్టి భయాందోళనలు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం గంజాయి ఎక్కడ విక్రయిస్తున్నారు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు గంజాయి పీల్చి తిరుగుతున్నా పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
నగరంలో అన్ని ప్రాంతాలను పర్యవేక్షించాల్సిన అధికారుల్లో కొందరు సందులు గొందుల్లో కూడా నిఘా ఉంచడం కోసం, పోలీస్ వాహనాలకు, తో తిరిగే బ్లూ కో టూ వీలర్ లను చేర్చారు. స్థానిక ఇన్ స్పెక్టర్లు ఈ వాహనాలను వినియోగించుకోవడంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం కారణంతో గంజాయ్ బ్యాచ్ ఆగడాలు పెరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.
గంజాయ్ విక్రయించే దెవరు? ప్రత్యేక నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ శాఖ, గంజాయి విషయంలో చూసీచూడనట్లు ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఇక శాంతి భద్రతలకు భంగం కలిగితే తప్ప, స్థానిక పోలీసులు పట్టించుకోరనే పేరు కూడా ఉంది. ఇ కటాస్క్ ఫోర్స్ వంటి విభాగాలు దొరికిన గంజాయిని పట్టుకోవడం తప్ప స్థానిక పోలీసులు మాత్రం గంజాయిని నియంత్రించడంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో దాని మూలాలు కనిపెట్టే పనిలో మాత్రం పోలీసులు శ్రద్ధ చూపడం లేదు. నగరంలో గంజాయిని దిగుమతి చేసుకునే ఏజెంట్ ఎవరు, ఏ అధికారులు వారికి సహకరిస్తున్నారు, తెర వెనక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా, గంజాయి విక్రయం ఎవరి ద్వారా జరుగుతుంది, విషయాలను దర్యాప్తు చేసేందుకు పోలీసులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. నగరానికి గంజాయి రవాణా అవ్వకుండా, పోలీసులు అన్ని దారులు మూసి వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రజలు అనుకుంటున్నారు.
గంజాయి విక్రయించే ప్రదేశాలు.
రైల్వే స్టేషన్ పరిసరప్రాంతాలు, సత్యనారాయ ణపురం, టూ టౌన్, కృష్ణలంక, అజిత్ సింగ్ నగర్, పటమట, మాచవరం , పాయకపురం తదితర పోలీస్సేషన్ పరిధిలోని గంజాయి సేవించేవారు ఎక్కువగా ఉంటున్నారని, ఈ ప్రాంతాల్లోనే రహస్యంగా విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి.