భూములకు సంబంధించిన అడంగల్ సవరణలు అనగా పేర్లు తప్పుగా పడటం, ఆన్లైన్‌లో సున్నా చూపించటం, విస్తీర్ణంలో తేడాలు, వర్గీకరణ మార్పులు ఇక నుంచి తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఎ. సూర్యకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కలెక్టరేట్ వరకు రావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. సదరు మార్పుల విషయమై ఇక నుంచి స్థానిక సచివాలయంలో లేదా మీసేవల్లో దరఖాస్తు చేసిన యెడల ప్రభుత్వ నిబంధనల మేరకు తహశీల్దార్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి జిల్లాలోని తహశీల్దార్లకు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆమె తెలిపారు.