సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాట్నాకు చెందిన 'గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీ' ప్రియాంక గుప్తా తన టీస్టాల్ మూసేసింది. కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. సహజంగానే తన టీ విక్రయ వ్యాపారంలో విజయం సాధించిన ప్రియాంక ఫుడ్ ట్రక్కును కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఆమె టీ స్టాల్ ప్రారంభంలో విజయం సాధించిన తర్వాత, ఆమె ఆహార పదార్థాలను అందించే బిజినెస్ చేపట్టినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఈ అమ్మాయి టీస్టాల్ పెట్టడం ఓ వ్యక్తిని కదిలించిందని తెలుస్తోంది. ఆ దాత సాయంతో ఆమె ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్రారంభించింది. తన కొత్త వ్యాపారంలో డ్రైవర్‌తో సహా ఇద్దరు సహాయకులను పనిలో పెట్టుకుంది.
ఇటీవల జాతీయ స్థాయిలో ఆమె వీడియో వైరల్ అయింది. స్పందించిన దాత ఆమెకు ట్రక్కును ఉచితంగా అందించారు. అయితే దానిని ఉచితంగా తీసుకోవడానికి ఆమె నిరాకరించింది. ట్రక్కు ధరను వాయిదాలలో చెల్లించే విధంగా దాతతో ఒప్పందం చేసుకుంది. దానికి సదరు దాత కూడా సరేననడంతో ఆమె కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక డిగ్రీ చదివిన ప్రియాంక ఉద్యోగం లేక టీ అమ్మడం ప్రారంభించింది.
ఆమె వివిధ ప్రభుత్వ పరీక్షలకు హాజరైనా, వాటిలో విజయం సాధించలేకపోయింది. ది, కానీ వాటిని క్లియర్ చేయలేకపోయింది. ఇంట్లో కూర్చోకుండా తన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఉమెన్స్ కాలేజీ దగ్గర టీ స్టాల్‌ను ప్రారంభించింది. ఆమె 'ఆత్మనిర్భర్' కథ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇది ఎంతో మంది యువతులకు స్ఫూర్తినిచ్చింది.