సమాజంలో రోజురోజుకూ విలువలు పతనం అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే అవతలి వ్యక్తులపై కోపం పెంచుకుంటున్నారు. కావాలని గొడవలు పెట్టుకుని ఏకంగా ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో రూ.30 అప్పు ఇవ్వాలని అడిగితే, కొందరు బరి తెగించారు. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని టండా ధాకి గ్రామంలో యశ్‌పాల్(50) అనే వ్యక్తి కిరాణా దుకాణం పెట్టాడు. దాని ద్వారానే ఆయన జీవనోపాధి పొందుతున్నాడు. ఇటీవల అతడి వద్ద గ్రామానికి చెందిన భూపేంద్ర, యోగేంద్ర, ఆషి రూ.30 అప్పు పెట్టారు. శనివారం రాత్రి వారు కనిపించగానే రూ.30 అప్పు చెల్లించాలని యశ్ పాల్ అడిగాడు. దీంతో తమను అప్పు తిరిగి చెల్లించమన్నందుకు వారు ముగ్గురూ ఆగ్రహంతో రగిలిపోయారు. యశ్‌పాల్‌తో గొడవకు దిగారు. వారి మధ్య వాగ్వాదం తీవ్రంగా జరిగింది.
కోపం పట్టలేని ఆ ముగ్గురు యశ్‌పాల్‌ను కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. వారి దెబ్బలకు తాళలేక యశ్ పాల్ స్పృహ తప్పాడు. వెంటనే అతడిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కుటుంబ సభ్యులు హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటిలోనే మృతి చెందాడు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారి కోసం గాలింపు చేపట్టామని ఏఎస్‌పీ రామ్ అర్జ్ తెలిపారు.