దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,202 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు ఆదివారం రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,487గా ఉంది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,31,23,801కు చేరుకుంది. తాజాగా 27 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 524,241కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక కొత్తగా 2,550 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కలిపి కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 42,582,243కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం17,317 యాక్టివ్ కేసులు ణ్నాయి.
గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో వైరల్ అనారోగ్యం కోసం 2,97,242 నమూనాలు పరీక్షించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 3,10,218ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు. తాజా కరోనా కేసుల్లో ఢిల్లీ నుంచి 613 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో మహమ్మారి బారిన పడి ముగ్గురు మరణించారు. మహారాష్ట్రలో 255 పాజిటివ్ కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు.