ప్రమాదవశాత్తు డాబా పై నుంచి పడి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది. నారాకోడూరు గ్రామంలోని ఎస్ వి ఎస్ పి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు అదే మిల్ లో ఉన్న క్వార్టర్స్ లో నివాసముంటున్నారు. రెండో అంతస్తు లో కార్మిక కుటుంబానికి చెందిన ఏడు సంవత్సరాల వయస్సు గల విగ్నేష్ మాలిక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి పోయాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.