బుద్ధ పూర్ణిమ సందర్భంగా కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెండు డజన్లకు పైగా దేశాల ఆధ్యాత్మిక నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి దలైలామా మాట్లాడుతూ.. నేను అన్ని మత సంప్రదాయాలను గౌరవిస్తాను అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్య (ఐబిసి) సహ-హోస్ట్ గా వ్యవహరించగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు మీనాక్షి లేఖి పాల్గొన్నారు. కంబోడియా, వియత్నాం, దక్షిణ కొరియా, మంగోలియా, రష్యా, ఇండోనేషియా, తైవాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, థాయిలాండ్, మెక్సికో, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు.