జగన్రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ప్రశ్నించారు. వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది.. ఐదుకోట్లమందిపైనా దాడి చేయిస్తారా జగన్రెడ్డి గారు? అని ప్రశ్నించారు.