స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎల్ఐసీ షేర్లు వాటాదారుల ఆశల పై నీళ్లు చల్లాయి. ఇష్యూ ప్రైస్ రూ.949 కాగా రూ.867 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.42,500 కోట్లు ఆవిరైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.57 లక్షల కోట్లకు పడిపోయింది. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ 8.62 శాతం నష్టంతో రూ.867.20 వద్ద నమోదైంది.
ఇష్యూ ధర అయిన రూ.949 వద్ద ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లుగా నమోదైంది. నష్టాల వల్ల ఆ విలువ 5.57 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఐపీవోలో మదుపర్ల సంపద ఒక్క రోజే రూ.42,500 కోట్లు ఆవిరైపోయింది. లిస్టింగ్ లో తడబడిన షేర్లు ఇంట్రాడేలో ఏ దశలోనూ ఇష్యూ ధరను అందుకోలేక పోయాయి. స్టాక్ ఎక్స్చేంజ్ లో ఊహించని పరిణామాల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు.