ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదలైన పవనన్న ప్రజాబాట, నెల్లూరు ని వణికిస్తున్న జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 12:33 PM

రాజకీయాలలో వినుతా మార్పుల కొరకు  సరికొత్త రీతిలో  ప్రయత్నం చేస్తున్న పార్టీ జనసేన. సినీ నటుడు పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం , అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే మార్గం లో నడవడానికి యావత్  ఆంధ్ర రాష్ట్రమంతటా ఎంతో మంది నాయకులుగా , కార్యకర్తలుగా ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరు నుండి కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనే ఒక సామాన్యుడు , ప్రజలకి మేలు చెయ్యాలి అనే భావనతో నెల్లూరు నగరమంతా తిరుగాడుతూ, ప్రత్యర్థుల కి నిద్ర లేకుండా చేస్తున్నాడు అంటే నమ్మక తప్పదు. అలానే నెల్లూరు నగరంలో "పవనన్న ప్రజాబాట " అనే బృహత్తర కార్యక్రమం చేపట్టి ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దాదాపుగా ఏడాది పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలియచేసారు. ఇందులో భాగంగా ఈ యాత్ర మొదలుపెట్టి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అక్కా... నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి... జనసేన పార్టీ... మా నాయకుడు పవన్ కళ్యాణ్... ఒక్క ఛాన్స్ అంటూ జగన్ కి ఛాన్స్ ఇచ్చారు... ఇప్పుడు అనుభవిస్తున్నారు... ఈ సారి మా నినాదం పవన్ రావాలి, జగన్ పోవాలి... అందుకే ఈ పవనన్న ప్రజాబాట అని ప్రజలకి వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa