*పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
*మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం ఎంతో అవసరం.
*పుస్తకాలు చదవడం వల్ల అపారమైన జ్ఞానాన్ని పొందొచ్చు.
*రెగ్యులర్ గా పుస్తకాలు చదివేవాళ్లు మిగతావారికంటే మరో రెండేళ్లు ఎక్కువకాలం బతుకుతారని ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడించింది.
*వారానికి కనీసం 3.5 గంటలు చదివేవారి మెదడు చురుకుగా ఉంటుంది.
*పుస్తకాలు చదివేవారు నిత్యం ఉత్సాహంగా ఉంటారు.
*పుస్తకాలు చదివితే రోజూ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి.
*ఫోన్ లో చూసి చదవడం కంటే పుస్తకంలో చూసి చదివితే ధ్యానం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
*పుస్తకాలు చదవడం వల్ల మనసు తేలిక అయ్యి ఉత్సాహం రెట్టింపు అవుతుంది.