పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ది కార్తీక్ మరణించాడు. పరీక్ష రాస్తుండగా వాంతులు చేసుకోని అచేతనంగా పడిపోయాడు. గమనించిన అధ్యాపకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్ది మరణించాడు. విద్యార్ది కార్తీక్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా దాసుపురం గ్రామం. ఈ ఘటనతో షాకైన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరవుతున్న వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.