నడిరోడ్డుపై స్కూల్ గర్ల్స్ రెచ్చిపోయారు. జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకుంటూ చితకబాదుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..సెయింట్ మార్క్ రోడ్డులో కొందరు స్కూల్ గర్ల్స్ రెండు గ్రూపులుగా మారి గొడవకు దిగారు. బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్కు ఎదురుగానే విద్యార్థులు పరస్పరం కొట్టుకున్నారు.
స్కూల్ విద్యార్థులు కొట్టుకోవడం స్థానికులకు ఒక యుద్ధంలాగా అనిపించింది. ఆ ప్రాంతం అంతా భయానకంగా మారిపోయింది. స్కూల్ గర్ల్స్ అంత తీవ్రంగా కొట్టుకోవడం చూసిన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై అటు అధికారులుగానీ, ఇటు స్కూల్ యాజమాన్యం గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం స్కూల్ గర్ల్స్ కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.