కాలుష్యం వల్ల ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే చైనాలో కాలుష్య మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇండియా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ‘ద లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ అనే జర్నల్ లో ఈ విషయాలను పొందుపరిచారు.
అమెరికాకు చెందిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ సంస్థ వారి డేటాబేస్, సియాటిల్‌లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ నుంచి లెక్కలు తీసుకున్న ఈ అధ్యయనం చేశారు. భారత్‌లోనే కాలుష్యం వల్ల ఏటా 22 లక్షల మంది అనారోగ్యాల బారిన పడి చనిపోతున్నట్లుగా తేలింది.