ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు అంశాలలో అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండోసారి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. 'స్కోచ్' సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ వరుసగా మొదటి స్థానం దక్కింది. స్కోచ్ సంస్థ వరుసగా రెండో ఏడాది గ్రామీణాభివృద్ధి (Rural Development)లో 'Chief Minister Of The Year Award'కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎ౦పిక చేసి౦ది.
మరోవైపు సుపరిపాలనలో కూడా ఏపీ టాప్‌లో నిలిచింది. సుపరిపాలనలో ఏపీ ఒక్కటే టాప్-5లో ఉండగా.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం ఈ ఘనతను అందుకోలేదు. ఏపీ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడవ స్థానంలో ఒడిశా, నాలుగో స్థానంలో గుజరాత్‌లు ఉన్నాయి.. మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఉత్తరప్రదేశ్-7, మధ్యప్రదేశ్-8, అస్సాం-9, హిమాచల్‌ప్రదేశ్ -10, బీహార్ -11, హర్యానా – 12వ స్థానాల్లో ఉన్నాయి.
స్కోచ్ సంస్థ ప్రతి ఏడాది దేశంలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేస్తోంది. ఈ సర్వేలో గత మూడేళ్లుగా ఏపీ సర్కార్ అగ్రస్థానంలో నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు, పథకాలను చేరవేస్తోంది. ఈ అంశాలు గ్రామీణాభివృద్ధిలో ఏపీ మెరుగైన ర్యాంకులో నిలిపాయి. ఈ అవార్డు రావడంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.