ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. దీంతో మెజారిటీ ఓటర్ల అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చేరువ అయ్యే రీతిలో వైసిపి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 26 నుంచి వైఎస్సార్‌సీపీ బస్సు యాత్రకు సిద్ధమైంది. సామాజిక న్యాయం పేరిట ఈ యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర, బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో భాగస్వాములు కాబోతున్నారు.
ఈ నెల 26న శ్రీకాకుళం లేదా విజయనగరంలో బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు. రాత్రికి విశాఖలో బస చేసి.. 27న రాజమండ్రిలో సభ నిర్వహిస్తారు. రాత్రికి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు.. 28న పల్నాడు జిల్లా నరసరావుపేటలో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి నంద్యాల చేరుకుని అక్కడే బస చేస్తారు. 29న అనంతపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.