పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని St Anna's junior College for Girls నందు దిశ యాప్ గురించి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చదువు కునే విద్యార్థినిలు, టీచర్స్ స్కూల్ కి వెళ్లి వచ్చు సమయంలో ఆకతాయిలు నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు అని , ఆటోలలో ప్రయాణించేటప్పుడు ఈ యాప్ బాగా ఉపయోగ పడుతుంది అని తెలియపరిచారు. SI పెంచలయ్య గారు మాట్లాడుతూ..... విద్యార్థినులు తమకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మీ తల్లితండ్రులకు లేదా టీచర్ లకు తెలియ పరచి మీ ప్రాబ్లమ్స్ ను తీర్చుకోవాలి. కానీ పక్షంలో దిశ పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి వెంటనే మీ సమస్యను తీర్చుతాము అని తెలియ పరచారు.