రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన గొర్లె సత్యం (55) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు జె. ఆర్. పురం పోలీసులు మంగళవారం తెలిపారు. గత నెల 10న సత్యం పాతర్లపల్లిలో తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజానుసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ గురువారం ఆస్పత్రిలో మృతి చెందాడు. అనారోగ్యం వల్లే గడ్డిమందు తాగినట్లు ఈ నెల 11న జే. ఆర్. పురం పోలీసులకు సత్యం వాంగ్మూలం ఇచ్చాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. జె. ఆర్. పురం ఎస్సై జి. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.