ప్రభుత్వ ఉద్యోగస్తులు నిజాయితీగా పని చేయాలని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సూపర్ స్పెషాలిటీ సమీపములో ఉన్న జానకి రామయ్య కాలనీ నందు ఉన్న గాయత్రి అతిథి భవనాన్ని మరమ్మతులు పూర్తి చేసి ఈరోజు పుట్టపర్తి జిల్లా రిజిస్టర్ కార్యాలయము, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ, ఆహార భద్రతా శాఖ వారి కార్యాలయం, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టాంపులుఅండ్ రిజిస్ట్రేషన్, డీఐజీ, శ్రీమతి మాధవి, పుట్టపర్తిఆర్ డి ఓ భాగ్య రేఖ, రిజిస్ట్రేషన్ అధికారి రవి వర్మ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు, వేద పండితుల ఆశీర్వాదంతో పూజ తో కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ వీధులలో ప్రజలకు మమేకమై నాణ్యమైన సేవలు ప్రజలకు అందించాలని తెలిపారు
రానున్న రోజుల్లో జిల్లా ప్రధాన కేంద్రం లో సుమారు 15 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ శాఖలో ఏర్పాటు కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పుట్టపర్తి జిల్లా విస్తారంగా అభివృద్ధి చెందాలంటే అన్ని కార్యాలయాలు ఒక చోట ఉండే విధంగా కార్యాచరణ ప్రణాళిక లకు అమలకు ప్రభుత్వ ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందనితెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు ఉద్యోగస్తులు ప్రజలకు అంకితభావంతో నిజాయితీగా సేవలు అందించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తనకు , తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలియజేస్తూ గత అనుభవాలను వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే తన దృష్టిలో ప్రజా సేవకులు అని ప్రజలకు పనిమనిషిగా నిజాయితీగా తమ తమ వృతి ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగస్తులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే పరిపాలన పనులు చేపట్టాలని అన్నారు. నూతన జిల్లాలో శాఖ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని ఈ శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా సమిష్టి కృషితో అధికారులుపని చేయాలని ప్రభుత్వ ఆదాయ మార్గాల కొరకు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పుట్టపర్తి అభివృద్ధిలో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ శాఖలను జిల్లా ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. తద్వారా ప్రజలకు సులభతరమైన సేవలు అందించుటకు వీలుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో పుడా వైస్ చైర్మన్ నరేష్, జిల్లా ఆహార భద్రతా అధికారి రామచంద్ర, ఎఫ్ ఎస్ ఓ, తస్లీమా, పలువురు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.