ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైలెట్ అప్రమత్తంతో...తప్పిన పెను ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 12:29 PM

పైలెట్ లే  విమాన ప్రయాణికులకు  ప్రాణ నిలిపే  యోధులు. తాజాగా జరిగిన ఓ ఘటనయే ఇందుకు నిదర్శనం. ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. గగనతలంలో ఉండగానే విమానంలోని ఒక ఇంజిన్ ఆగిపోవడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43గంటలకు బెంగళూరు బయలుదేరింది. 


రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ముంబై మళ్లించి 10.10 గంటలకు ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com