పెట్రలో, డీజీల్ విషయంలో కేంద్రంలోని బీజేపీకి అవకాశమివ్వకుండా కేరళ అన్ని రాష్ట్రాల కంటే ముందుగా స్పందిస్తూ రాష్ట్ర పన్నులను తగ్గించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ తగ్గించడంతో రాష్ట్రాలు సైతం అదే బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం నిర్ణయానికి స్పందనగా.. ప్రజలకు మరింత ఊరట కల్పిస్తూ కేరళ ప్రభుత్వం సైతం అదే బాటలో నడిచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, లీటర్ డీజిల్‌పై రూ.1.36 చొప్పున సుంకాలను తగ్గించింది. గత ఏడాది నవంబర్‌లో పెట్రో ధరలను తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని పిలుపునిచ్చింది. కేంద్రం సూచనకు స్పందించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు సుంకాలను తగ్గించాయి.
కానీ ఈ దఫా కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ ముందుగా స్పందించి పన్నులు తగ్గించడం గమనార్హం. విజయన్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తుండగా.. కొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గించిది కదా.. కేరళ ప్రభుత్వం అదే స్థాయిలో ధరలను ఎందుకు తగ్గించలేద’ని బీజేపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఇంధనం ధరలు తక్కువగా ఉన్నాయి. కేరళలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19 లోపు ఉండగా.. లీటర్ డీజిల్ రేటు రూ.103.95గా ఉంది. కేంద్రం తగ్గింపు, రాష్ట్రం తగ్గింపు కలుపుకుంటే.. పెట్రోల్ ధర రూ.106 లోపుగా ఉండనుంది. డీజిల్ ధర రూ.96 కంటే దిగువకు తగ్గనుంది.
కేరళ బాటలోనే మిగతా రాష్ట్రాలు కూడా పయనించే అవకాశం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాలు తగ్గించడం కష్టమే కావచ్చు. ఎందుకంటే పెట్రోల్‌పై పన్నులు తగ్గించబోమని గతంలోనే కేసీఆర్ స్పష్టం చేశారు. మేం పన్నులు పెంచలేదు కాబట్టి తగ్గించమని ఆయన తెలిపారు. ఇక ఏపీ సైతం ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.