ధరలను ముందు ఎక్కువగా పెంచి తర్వాత నామమాత్రంగా తగ్గించడం సరికాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. గత ఆరు, ఏడేళ్ల క్రితం ఉన్న విధంగా ఎక్సైజ్ పన్నును తగ్గిస్తేనే దేశ పౌరులకు నిజంగా ఊరట లభిస్తుందని ఉద్ధవ్ అన్నారు. ఎక్సైజ్ పన్నును కేంద్రం మరింత తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రెండు నెలల క్రితం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నును రూ.18.42లు, రూ.18.24లుగా పెంచిందని, ఇప్పుడు దానిని రూ.8లు, రూ.6లుగా తగ్గించిందని ఆయన అన్నారు.
అలాగే ఇదే విషయంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ కూడా స్పందించారు. చమురు ధరలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను అడుగుతున్నారని, మరీ ఏ రాష్ట్రాన్ని అడిగి ధరలు పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్‌పై పన్నులు పెంచినప్పుడు రాష్ట్రాలకు కనీసం సమాచారం ఇవ్వరని, ఇప్పుడు మాత్రం వ్యాట్‌ను తగ్గించాలని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్రోల్‌పై రూ.23లు, డీజిల్‌పైరూ.29లు పెంచిందన్నారు.