చార్జింగ్ పెట్టిన ఐస్ క్రీమ్ బాక్సుల వద్ద ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ కు గురై విద్యార్థి మృతిచెందిన సంఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే హిందూపురం పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న గీత ఐస్ క్రిమ్ పరిశ్రమ నిర్వాహకుడు అశ్వర్ధప్ప కుమారుడు చరణ్ (12) ఐస్ క్రీమ్ పరిశ్రమలో ఆడుకుంటున్నాడు. పక్కనే చార్జింగ్ పెట్టిన్ ఐస్ క్రీమ్ బాక్సులు ఉన్నాయి. ఆడుకుంటూ ఒక బాక్సునుతాకగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు.
అయితే అక్కడ పనిచేస్తున్నవారు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వన్ టౌన్ ఎస్ఐ దాదాపీర్ తెలిపారు.