2017లో రోడ్డు ప్రమాదంలో ద్వారా ఒక వ్యక్తి మరణానికి కారణమైన షేక్ అలీ అనే ఆర్టీసీ డ్రైవర్ కు సోమవారం జిల్లా 2వ అదనపు సెషన్స్ జడ్జి వెంకటేష్ 18 నెలలు జైలుశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. ఈ కేసును అప్పటి ఎస్సై, ప్రస్తుత కౌటాల సిఐ బుద్దె స్వామి దర్యాప్తు చేయగా సమగ్రమైన సాక్ష్యాధారాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పులి రాజమల్లు సేకరించి కోర్టులో సమర్పించారు. దీంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.