గత రెండు వారాలుగా లునా వాల్యూ భారీగా పడిపోతూ ఉంది. టెర్రా సిస్టర్ కాయిన్ అయిన లునాకి స్టేబుల్ కాయిన్‌గా పేరు ఉండేది. కానీ ఇప్పుడు దీని వాల్యూ జీరో వద్ద ట్రేడవుతోంది. లునాలో ఉన్న 1.6 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు... ప్రస్తుతం 2,200 డాలర్లకు ఎలా పడిపోయాయో చాంగ్‌పెంగ్ జావో వివరించారు. ప్రస్తుతం లునా 18.6 శాతం నష్టంలో 0.0001416 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వాల్యూను తీసుకుంటే.. బినాన్స్ నిర్వహిస్తోన్న 15 మిలియన్ లునా టోకెన్ల ప్రస్తుత మార్కెట్ ధర వద్ద లెక్కిస్తే 2,214 డాలర్లుగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ వ్యవస్థాపకుడు, బిలీనియర్ చాంగ్‌పెంగ్ జావో తాను మళ్లీ పేదవాడిని అయిపోయానంటూ ప్రకటించుకున్నారు. లునా వాల్యూ భారీగా క్రాష్ కావడంతో ఈ క్రిప్టో కరెన్సీలో తన ఎక్స్చేంజ్ పెట్టుబడులు 1.6 బిలియన్ డాలర్ల నుంచి 2,200 డాలర్లకు పడిపోయాయని చెప్పారు. నెల వ్యవధిలోనే ఈ పెట్టుబడులు ఈ మేర తగ్గిపోయాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయినా బినాన్స్ 15 మిలియన్ లునా టోకెన్లను నిర్వహిస్తుందని జావో వెల్లడించారు.
ప్రస్తుతం లునా క్రిప్టోకరెన్సీ వాల్యూ జీరోకి క్రాష్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఇన్వెస్టర్ల సంపద గల్లంతైంది. లునా కుప్పకూలడం వల్ల బినాన్స్ ఫౌండర్ బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు. ఈ నష్టంతో ఆయన మళ్లీ తనకు తాను పేదవాడిగా మారినట్టు ట్వీట్ చేశారు. పూర్ అగైన్ అనే క్యాప్షన్‌తో ఫార్చ్యూన్‌లో ఓ ఆర్టికల్‌ను ఉట్టంకిస్తూ ట్వీట్ చేశారు.