ఇస్లాంలో గొప్ప తనం ఉంది అందుకే ఆ మతం పెరిగిందని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ బ్రాహ్మణులే.. కులం ప్రభావం తగ్గితేనే సమాజం బాగు పడుతుందన్నారు. రాష్ట్రం లో కమ్మ , రెడ్డి అనే డివిజన్ 2014నుండి బాగా వచ్చిందని, గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్, ఇప్పుడు రెడ్డి డామినేషన్ అని వ్యాఖ్యానించారు. గతంలో ముసుగు ఉండేది.. ఇప్పుడు ఆ ముసుగు తీసేశారన్నారు. ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టా రాజ్యంగా మారుతుందని, అధికారం కన్నా పది శాతం ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మండి అన్నారు.
ఇమేజ్ ఉండి, ప్రశ్నిస్తా అని ముందుకి వచ్చే వాళ్లని ప్రోత్సహించాలన్నారు ఉండవల్లి. తాను చాలా అంశాలు చెప్పినా.. మీడియా ఫోకస్ చేయలేదన్నారు. పూర్తి పారదర్శక పాలన కోసం ఆన్ లైన్ లొ అన్ని అంశాలు ఉంచాలన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థకి అర్ధమే ఇప్పుడు మారిపోతుందన్నారు. నేటి మీడియాని క్యాపలిస్టులు మేనేజ్ చేస్తున్నారని, పబ్లిక్ డొమైన్‌లో పెట్టే వారికే ఓటు వేయాలన్నారు. నేర స్వభావం ఉన్న వాళ్లనే ప్రజలు అంగీకరిన్నారని.. ప్రజా స్వామ్యంలో అటువంటి వారిని ఎవరూ అడ్డుకోలేరన్నారు.
ఇటీవల ఒక జడ్జే స్థలం వివాదంలో రౌడీ షీటర్ ను ఆశ్రయించారని అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలను కూలగొట్టడానికే మక్కాలో మహ్మదీయ మతం పుట్టిందని, మనత్ అనే విగ్రహాన్ని తీసుకెళ్లి దాచేశారని చెబుతారన్నారు. ఆరోజు పరస్పర దాడుల నేపధ్యంలో ఈ దాడులు విస్తరించాయని.. తమ మతంలోకి వస్తే ఆలింగనం, కాదంటే చంపుతాం అని బెదిరించారన్నారు.
ఎవరికైనా ఒకే కాస్ట్ తో విజయం సాధించడం సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ. పవన్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తి కాదన్నది తన అభిప్రాయం అన్నారు. బీజేపీ నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారు అవుతాయని.. ఏపీలో ఎవరు నెగ్గినా 25 ఎంపీలు బీజేపీవే అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నానని బీజేపీ కాదంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ కాదు ద్విముఖ పోటీ ఉంటుందన్నారు. అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చెబుతున్నాన్నారు.