ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక జరగనుంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరులో ఎన్నిక జరగనుంది.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30వ తేదీన ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన జూన్ 6వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు జూన్ 9. దేశవ్యాప్తంగా జరగనున్న ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 23న ఎన్నికలు, జూన్ 26న ఫలితాలు వెల్లడికానుండగా.. పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.