రాష్ట్రంలో వైసీపీ పార్టీ అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకి వివరించాలని గడప గడప కి మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. అలానే ... ఈ నెల 26 నుండి 29 వరకు బస్సు యాత్ర కూడా నిర్వహించాలని అనుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు మంత్రులందరూ ఈ బస్సు యాత్రలో పాల్గొనడానికి సిద్ధమౌతున్నారు. వైఎస్సార్ సీపీ ‘సామాజిక న్యాయ భేరి’ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ఈరోజు ప్రారంభమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. శ్రీ వైఎస్ జగన్ గారు అమలు చేసిన, చేస్తున్న సామాజిక న్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రజల్లోకి వస్తున్నారు.