గంగాధరనెల్లూరు మండలం, కడపగుంట గ్రామంలో నడీ వీ దిగంగమ్మ తల్లిజాతరను రెండు రోజుల పాటు సర్పంచ్ బుజ్జి మణి ఆధ్వర్యంలో గ్రామస్తులు వైభవంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం గ్రామ పెద్దలు గంగమ్మ అమ్మవారిని గ్రామంలోని నడివీధిలో కొలువుదీర్చగా, మహిళలు చిన్నారులు అంబళ్లు పోసి, మ్రొక్కులు చెల్లించుకుని విశేష పూజలు చేశారు. అనంతరం బుధవారం అమ్మవారికి దున్నపోతును బలి అర్పించి, దీపారాధన చేపట్టారు.
ఈ ఉత్సవంలో దాదాపు 1000 ఇళ్లు ఉన్న కడపగుంట గ్రామంలో పార్టీలకతీతంగా పెద్దలు మొదలుకొని చిన్నారుల వరకు అందరూ కలిసికట్టుగా ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, చిదంబరం, పుష్ప రాజ్, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.