నందికొట్కూరు పట్టణంలో టమోటా పండ్లు 110 రూపాయలకు దర పెరగడంతో గృహిణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు.