రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించాలంటూ టిడిపి నాయకులు మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు ఎదుట ద్విచక్ర వాహనాలను ఆపి ధర్నా కార్యక్రమాన్ని మండల, టౌన్ కన్వీనర్లు అడపాల రామకృష్ణ, వలిపి శ్రీనా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవ రకూ పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించకపోడం బాధాకరమన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో నిత్యావసర వస్తువుల పై అధిక భారం పడుతున్నదన్నారు.
అసలే కరువుకాట కాలతో ప్రజలు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనితో కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం పేద ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటున్నదే తప్పా పేద ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర పన్ను తగ్గించాలని లేకపోతే టిడిపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వా నికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీవీ శివప్రసాద్, సర్పద్ధిన్, సైకిల్ షాప్ బాబా, చికెన్ సెంటర్ నాగేంద్ర, కిరణ్, పోతుల కుంట మళ్లీ, గోరంట్ల పల్లి శీనా, తదితరులు పాల్గొన్నారు.