అక్రమంగా గ్రానైట్ శ్లాబులను తరలిస్తున్న లారీని మార్టూరు ఎస్సై రవీంద్రా రెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. లారీతో సహా 225 గ్రానైట్ శ్లాబులను సీజ్ చేశారు.
ఇసుక దర్శి వద్ద ఎస్సై వాహనాలను తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన ఓ లారీ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయాడు. దీంతో ఎస్సై అప్రమత్తమై ఆ లారీలో ఉన్న ఇతరులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డ్రైవర్ నుకూడా వెంటాడి పట్టుకున్నారు.
ఆ నలుగురూ నాగరాజుపల్లి సమీపంలోని మహాలక్ష్మీ గ్రానైట్ ఫ్యాక్టరీ నుండి ఎటువంటి బిల్లులు, అనుమతి పత్రాలు లేకుండా గ్రానైట్ శ్లాబులను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. సీజ్ చేసిన గ్రానైట్ శ్లాబుల విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందని ఎస్సై రవీంద్రా రెడ్డి చెప్పారు. ప్రధాన నిందితుడు సునీల్ జాట్ మధ్యప్రదేశ్ కు చెందిన వాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు