పెద్దపప్పూరు మండలం పసులూరు కొట్టాలపల్లె గ్రామంలో ఈనెల 31వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామదేవతల పూజాకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థుడు పోట్ల బొజ్జన్న పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. శుభకృత్ నామ సంవత్సరం, జ్యేష్టమాసాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలైన పెద్దమ్మ, కుంటెమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు విరివిగా హాజరవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa